సెల్‌ఫోన్ మాట్లాడుతూ లేదా చూస్తూ వాహనం నడపడం ప్రమాదకరం అన్న సంగతి తెలిసిందే. సొంత వాహనాలు నడిపే వారి సంగతి ఎలా ఉన్నా సరే.. ప్రజా రవాణా సంస్థల్లో పని చేస్తున్న డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి దారుణాలు జరుగుతామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ కొందరు డ్రైవర్లు ప్రయాణీకులతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కొండగట్టు లాంటి ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఓ కారణం. ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫోన్‌ను వాడుతూ బస్సును నడిపాడు. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగింది అన్న సంగతి అయితే తెలీదు గానీ ఓ నెటీజన్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇతను వాడుతున్న ఫోన్ ఏ కంపెనీదో చెప్పుకోండి చూద్దాం.. భద్రత మీది బాధ్యత మీది అంటూ @tsrtcmdoffice #Tsrtcలను ట్యాగ్ చేశాడు.
ఈ వీడియోపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుని సంబంధిత డిపో మేనేజర్‌తో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కాగా.. కొన్ని చోట్ల డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు.