పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి
RTC Bus collides with Tanker in Armur.నిజామాబాద్ జిల్లాలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం
By తోట వంశీ కుమార్ Published on
2 July 2021 6:00 AM GMT

నిజామాబాద్ జిల్లాలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో ఆర్టీసీ బస్సు పెట్రో ట్యాంకర్‌ను ఢీ కొంది. కరీంనగర్ నుంచి ఆర్మూర్ వైపు వెలుతున్న ఆర్టీసీ బస్సు.. పెర్కిట్ శివారులో పెట్రోల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. బలంగా ఢీ కొట్టడంతో డ్రైవర్ సహా 20 మందికి ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని నిజామాబాద్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story