చిల్లర సమస్యకు తెలంగాణ ఆర్టీసీ చెక్.. ప‌ల్లెవెలుగు బ‌స్సు టికెట్ ఛార్జీల్లో రౌండ‌ప్

Roundup System in Pallevelugu Buses in TSRTC.ప‌ల్లె వెలుగు బ‌స్సుల్లో చిల‌ర్ల స‌మ‌స్య‌కు చెక్‌పెట్టేందుకు తెలంగాణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2022 7:41 AM GMT
చిల్లర సమస్యకు తెలంగాణ ఆర్టీసీ చెక్..  ప‌ల్లెవెలుగు బ‌స్సు టికెట్ ఛార్జీల్లో రౌండ‌ప్

ప‌ల్లె వెలుగు బ‌స్సుల్లో చిల‌ర్ల స‌మ‌స్య‌కు చెక్‌పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టికెట్ ధ‌ర‌ల్లో రౌండ‌ప్ విధానాన్ని తీసుకువ‌చ్చింది. కొత్త విధానం ప్ర‌కారం ప్ర‌స్తుతం ఉన్న ఛార్జీల్లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్‌ ధర రూ.10గా చేసింది. అలాగే.. రూ.13, రూ.14 ఉన్న టికెట్‌ ఛార్జీని రూ.15గా చేశారు. అలాగే 80 కిలోమీట‌ర్ల దూరానికి రూ.67గా ఉన్న రూ.65 వ‌సూలు చేయ‌నుంది.

ఇక టోల్‌ప్లాజా ఛార్జీలను తగ్గించుకునేందుకు ఆర్టీనరీ, హైటెక్, ఏసీ బస్సుల్లో ఛార్జీలను స్వ‌ల్పంగా పెంచింది. టోల్‌ప్లాజా ఛార్జీల కింద ఆర్డినరీ బస్సుల్లో రూ.1, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో రూ.2లు అదనంగా వసూలు చేయ‌నున్నారు. ఈ ధ‌ర‌లు నేటి నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయ‌ని.. ప్ర‌యాణీకులు సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని అధికారులు సూచించారు.

ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి స‌జ్జ‌నార్ సంస్థ‌ను గాడిలో పెట్టేందుకు త‌న‌దైన శైలిలో ముందుకు వెలుతున్నారు. ఆఫర్లు, ఫ్యాకేజీలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ప్ర‌యాణీకులు ఏమైన ఇబ్బందులు ఎదుర్కొంటే వెంట‌నే వాటిని ప‌రిష్కరిస్తూ టీఎస్ఆర్టీసీపై మ‌రింత న‌మ్మ‌కం పెరిగే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Next Story