తరగతి గదిలో ఊడిన పైకప్పు పెచ్చులు.. విద్యార్థినులకు గాయాలు.. హసన్‌పర్తి సర్కార్‌ బడిలో ఘటన

Roof scabs blown out at Hassanparthi ZP High School .. Injuries to students. పాఠశాలలోని ఓ తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని

By అంజి  Published on  24 Feb 2022 7:55 AM GMT
తరగతి గదిలో ఊడిన పైకప్పు పెచ్చులు.. విద్యార్థినులకు గాయాలు.. హసన్‌పర్తి సర్కార్‌ బడిలో ఘటన

పాఠశాలలోని ఓ తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలోని జిల్లా ప్రజా పరిషత్‌ హైస్కూల్‌లో చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థులు ఉన్న క్లాస్‌రూమ్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. పెచ్చులు మీద పడటంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. గాయపడిన వారిని పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

పాఠశాలలో జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాఠశాల దగ్గరికి పరుగులు తీశారు. గాయాలపాలైన విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య విషయమై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న వాటిని తొలగించి, మరమ్మత్తులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story
Share it