మెరుగైన రహదారులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి

Roads buildings department government of telangana.మెరుగైన రహదారులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Dec 2022 11:47 AM IST
మెరుగైన రహదారులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి

మెరుగైన ర‌హ‌దారులు దేశాభివృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తాయి. ర‌వాణా సౌక‌ర్యం బాగుంటే త్వ‌రిత‌గ‌తిన అభివృద్ధి సాధ్యం. అయితే.. ర‌హ‌దారుల విష‌యంలో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింది.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు ర‌హ‌దారుల ప‌రిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేది. జాతీయ ర‌హ‌దారులు చాలా త‌క్కువ‌గా ఉండేవి. రోడ్ల‌కు క‌నీసం మ‌ర‌మ్మ‌త్తులు లేకుండా గుంత‌లు ప‌డి, రాక‌పోక‌ల‌కు ఇబ్బందిక‌రంగా ఉండేది. ఈ ప‌రిస్థితిని కేసీఆర్ ప్ర‌భుత్వం తొలి రోజుల్లోనే గుర్తించింది. ర‌హ‌దారుల ప‌రిస్థితిని మెరుగుప‌ర‌చ‌డం ద్వారా తెలంగాణలో ప్ర‌గ‌తి బాట‌లు నిర్మించాల‌ని నిర్ణ‌యించింది. ర‌హ‌దారులు అభివృద్ధిని ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యాతంశంగా గుర్తించింది. రాష్ట్రం ఆవిర్భ‌వించిన నాటి నుంచి జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, రోడ్ల అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు ర‌చించి, అమ‌లు చేస్తోంది

రాష్ట్రం లో 27734 కి.మీ ల మేర రోడ్లు ఉండగా అందులో 1687 కి.మీ రాష్ట్ర రహదారులు , 11,463 కి.మీ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు , 14,584 కి.మీ ఇతర డిస్ట్రిక్ట్స్ రోడ్లు ఉన్నాయి.

మండల కేంద్రాల నుండి జిల్లా హెడ్ క్వార్టర్లకు డబుల్ లేన్ రోడ్లు :

మండ‌లాల‌ను, జిల్లాల‌ను రాష్ట్ర రాజ‌ధానితో అనుసంధానం చేసే రోడ్ల‌ను సింగిల్ లైన్ నుంచి డ‌బుల్ లైన్ రోడ్లుగా విస్త‌రిస్తోంది. జిల్లాల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు ముందు 459 మండ‌లాల‌కు గాను 145 మండ‌లాల‌కు డ‌బుల్ లైన్ రోడ్డు లేక‌పోవ‌డంతో రూ.2655 కోట్ల వ్య‌యంతో 1835 కి.మీల మేర 144 ప‌నులు మంజూరు చేసి 1669 కి.మీ ల ప‌నిని పూర్తి చేశారు.

రాష్ట్ర రహదారులు , మేజర్ రోడ్ల వైడేనింగ్ :


రాష్ట్ర రహదారులు , మేజర్ జిల్లా రోడ్లకు సంబంధించి పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలు తీరేలా సింగిల్ లేన్లను డబుల్ లేన్లుగా వెడల్పు చేశారు. రూ. 10647 కోట్లలో 5574 కి.మీ ల పనులు చేపట్టి 4032 కి.మీ ల పనులు పూర్తి చేశారు. దీని వ‌ల్ల‌ ముఖ్యమైన పట్టణాల నుండి మార్కెట్ సెంటర్లకు అనుసంధానం జరిగింది.

బ్రిడ్జిల నిర్మాణం :

వ‌ర్షాల సమయం లో వాగులు, వంకలు, నదులపై శిధిలావస్థలో ఉన్న బ్రిడ్జిల పునర్నిర్మాణం , వెడల్పు పనులకు సంబంధించి రూ. 2763 కోట్లలో 541 బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టి 350 బ్రిడ్జిల నిర్మాణం పూర్తియ్యయి. గోదావరి నది పై పంచగుడి, బోర్నాపల్లిల వద్ద, మానేరు నదిపై సదాశివపల్లి , నీరుకుళ్ళ మంజీరా నదిపై బీర్కూరు, వెంకంపల్లి వద్ద, ప్రాణహిత నదిపై గూడెం , కృష్ణా నదిపై మఠo పల్లి, మూల వాగుపై షాబాజ్ పల్లి వద్ద బ్రిడ్జిల నిర్మాణాలను పూర్తి చేయడమైంది. వీటితో పాటు 184 బ్రిడ్జిలను చెక్ డ్యామ్ లతో గృహ నిర్మాణాలను చేపట్టి 130 నిర్మాణాలను పూర్తి చేయడమైనది.

రేడియల్ రోడ్డు నిర్మాణం :

అవుటర్ రింగ్ రోడ్డుకు ట్రాఫిక్ వేగంగా చేరుకునేలా రూ. 761 కోట్లతో 4 రేడియల్ రోడ్లను 38 కి.మీ పనుల పురోగతిలో ఉన్నాయి.

రోడ్ల రెన్యువల్స్: రూ. 5051 కోట్లతో 14873 కి.మీ 2273 కోట్లతో 155 బ్రిడ్జిల పనులు రెన్యూవల్ చేపట్టి 8064 కి.మీ పూర్తి చేయడమైనది. రోడ్ల మరమ్మతులకు రూ.1865 కోట్లు మంజూరు చేసింది.

గ్రామీణ రోడ్ల నిర్మాణం : గ్రామీణ ప్రాంతాల నుండి మార్కెట్లకు, ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు రవాణా సౌకర్యం ఉండేలా ఆయా ప్రాంతాల సామాజిక, ఆర్థిక అభివృద్దికి దోహద పడేలా రోడ్లను అభివృద్ధి పరచాలని నిర్ణయించి సంబంధించి తెలంగాణ ఏర్పడ్డాక రూ. 1205 కోట్లతో 329 పనులు చేపట్టి 1308 కి.మీ మేర పనులు పూర్తి చేయడమైనది.

జాతీయ రహదారుల అభివృద్ధి :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2006 నుండి 2014 వరకు 1005 కి.మీ లు జాతీయ రహదారులుగా నోటిఫై చేయగా , తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక 2014 నుండి 2022 వరకు 22 రోడ్లకు సంబంధించి 2525 కి.మీ లను జాతీయ రహదారులుగా ప్రకటించడం జరిగింది. తెలంగాణాలో ప్రతి 1000 కి.మీ కు జాతీయ రహదారులు డెన్సిటీ 4.45 కి.మీ లు ఉండగా జాతీయ సగటు 4.29 కి.మీ గా ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రం లో జాతీయ రహదారుల నిడివి 2511 కి.మీ కాగా నేడది 4983 కి.మీ లకు పెరిగింది. రాష్ట్రానికి సంబంధించి 13 రాష్ట్ర రహదారులకు 1475 కి.మీ జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

గత ఎనిమిదేళ్ళలో జాతీయ రహదారులకు సంబంధించి రూ.19056 కోట్లతో 2199 కి.మీ ల రహదారులకు సమబంధించి 81 పనులు మంజూరు చేయడమైనది. 1223 కి.మీ జాతీయ రహదారులను రెండు లైన్లుగా అభివృద్ది చేయడమైనది. తెలంగాణ ఏర్పాడ్డాక జాతీయ రహదారులపై 6687 కోట్ల వ్యయం చేయడమైనది. సెంట్రల్ రోడ్ ఫండ్: సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా రూ.3314 కోట్ల విలువగల 245 పనులను మంజూరు చేయగా రూ. 2144 కోట్ల వ్యయం జరిగింది.

తెలంగాణ ఏర్పడక ముందు ఎనిమిదేళ్ళలో రూ.251 కోట్లతో 14 no's (ROB/RUB) లను పూర్తి చేయగా 2014 నుండి నేటి వరకు రూ.438 కోట్లతో 23 పనులను పూర్తి చేయడమైనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక అక్కనపేట మేదక్ 13.2 కి.మీ భద్రాచలం – సత్తుపల్లి 54 కి.మీ లతో పాటు మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్లలో 115 కి.మీ పూర్తి చేయడం జరిగింది.

LWE SCHEME : రూ. 1553 కోట్లతో భద్రాద్రి కొత్తగూడెం , జయ శంకర్ భూపాలపల్లి , ములుగు , మహబూబాబాద్, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో 1130 కి.మీ రోడ్లు 113 బ్రిడ్జిలను మంజూరు చేయగా గత ఎనిమిదేళ్ళలో రూ. 520 కోట్లతో 351 కి.మీ మేర రోడ్డు , 13 బ్రిడ్జిల నిర్మాణం పూర్తి అయ్యింది.

వివిధ భవనాల నిర్మాణం : రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షణలో 29 జిల్లాలలో కలెక్టరేట్ కాంప్లెక్సుల నిర్మాణం ప్రారంభంకాగా 15 జిల్లాలలో పూర్తి కాగా 11 పురోగతి లోనూ 3 జిల్లాలో ప్రారంభం కావలసి ఉన్నది. వీటితో పాటు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ , జిల్లా స్థాయి అధికారులకు రెసిడెన్షియల్ క్వార్టర్ల నిర్మాణం పనులు చేపట్టబడ్డాయి.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం : తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తిని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం నూతన సచివాలయ భవన నిర్మాణాన్ని చేపట్టింది. ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఏడు అంతస్తుల్లో సచివాలయం నిర్మాణం అవుతోంది. మంత్రులుండే అంతస్తుల్లోనే వారి శాఖల కార్యదర్శుల, సెక్షన్ల కార్యాలయాలు ఉంటాయి. అధునాతన హంగులతో సచివాలయం ముస్తాబవుతోంది. కొత్త సచివాలయంలో ప్రజలకు, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు మంచి సౌకర్యాలు ఏర్పడటంతో పరిపాలనలో వేగం పెరుగుతుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి.

125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణం

నగరంలోని హుస్సేన్సాగర్ తీరంలో, 125 అడుగుల ఎత్తుతో డాక్టర్ బాబా సాహెస్అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టించబోతోంది. స్వతంత్ర భారతదేశానికి దృఢమైన, లిఖిత రాజ్యాంగాన్ని అందించి, దేశ భవిష్యత్తుకు బాటలు వేసిన అంబేద్కర్ మహనీయునికి ప్రభుత్వం ఈ విధంగా ఘనంగా నివాళులర్పిస్తోంది.

తెలంగాణ అమర వీరుల స్మృతి వనం : తెలంగాణ పోరాటంలో అసువులుబాసిన అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా, లుంబినీ పార్కు సమీపంలో అమర వీరుల స్మారక స్థూపాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. పనులు పురోగతిలో ఉన్నాయి. ఎం.ఎల్.ఏ క్వార్టర్ లో ఐ.టి. బ్లాక్, సెంటర్ ఫర్ దళిత స్టడీస్, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ల నిర్మాణ పనులు రహదారుల భవనాల శాఖ ఆద్వర్యంలో జరుగుతున్నాయి.

రీజనల్ రింగ్ రోడ్ : హైదరాబాద్ నగరం శర వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కు అదనంగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు జిల్లాల నుండి హైదరాబాద్ కు మెరుగైన రవాణా సౌకర్యం ఈ రింగ్ రోడ్ ద్వారా కలుగుతుంది. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్ కు 30 కిలోమీటర్ల అవతల 340 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానుంది. ఈ రోడ్డు నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది.

Next Story