ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది బస్సుకు ప్రమాదం..ఎక్కడంటే?

బ్యాలెట్‌ బాక్సులను కరీంనగర్‌లో కౌటింగ్‌ కేంద్రాలో అప్పగించేందుకు ఎన్నికల సిబ్బంది రెండు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరారు. అయితే ఈ రెండు బస్సులకు ప్రమాదం జరగడంతో సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

By Knakam Karthik
Published on : 28 Feb 2025 3:46 PM IST

Telangana News, Karimnagar, Road Accident, Election Staff

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది బస్సుకు ప్రమాదం..ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాల్లో గురువారం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోనూ కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిమాజామాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్‌ బాక్సులను కరీంనగర్‌లో కౌటింగ్‌ కేంద్రాలో అప్పగించేందుకు ఎన్నికల సిబ్బంది రెండు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరారు. అయితే ఈ రెండు బస్సులకు ప్రమాదం జరగడంతో సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

బ్యాలెట్‌ బాక్సులను కరీంనగర్‌లో అప్పగించేందుకు నిర్మల్ జిల్లా ఎన్నికల సిబ్బంది రెండు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిళికొండ వద్దకు చేరుకోగానే నిర్మల్‌-బాన్సువాడకు చెందిన బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎన్నికల సిబ్బంది ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

Next Story