ఆ రోజు 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారు : మంత్రి కోమటిరెడ్డి

రాబోయే పదేళ్లపాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు

By Medi Samrat  Published on  8 May 2024 4:15 PM IST
ఆ రోజు 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారు : మంత్రి కోమటిరెడ్డి

రాబోయే పదేళ్లపాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం.. 5వ తేదీన‌ 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన చెప్పారు. “BRS దుకాణం ఖాళీ అవుతుంది. బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్‌లో చేరేందుకు నన్ను సంప్రదించారు’’ అని ఆయన పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో అరెస్ట్‌ కావడం ద్వారా తెలంగాణ గౌరవాన్ని దిగజార్చారన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల‌ విభజన ప్రక్రియ(డీ లిమిటేషన్) తర్వాత రాష్ట్రంలో 154 సీట్లు వస్తాయని మంత్రి చెప్పారు. వాటిలో 125 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మే 13న లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.

Next Story