కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఘన విజయం
తెలంగాణలో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతూనే ఉంది
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 1:49 PM ISTకొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఘన విజయం
తెలంగాణలో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతూనే ఉంది. పలుచోట్ల కాంగ్రెస్ విజయాన్ని అందుకుంది. మరోవైపు బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కూడా ఖాతాలు ఓపెన్ చేశాయి. అయితే.. ఈసారి ఓటర్ల మద్దతు మాత్రం కాంగ్రెస్‌కే దక్కిందని అర్థం అవుతోంది. ఇంకా మెజార్టీ స్థానాల్లీ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్‌లో పలువుర మంత్రులకు సైతం షాక్ తప్పలేదు.
కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెండు చోట్ల బరిలో నిలిచారు. కొడంగల్‌లో ఆయన తాజాగా భారీ విజయాన్ని అందుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి గెలుపొందారు. ప్రతి రౌండ్‌లో కూడా రేవంత్‌రెడ్డి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దాంతో.. పట్నం నరేందర్‌రెడ్డి ఓటమి ఖాయమని తెలియడంతో కౌంటింగ్ కేంద్రం నుంచి ముందుగానే వెళ్లిపోయారు. దాంతో.. లెక్కింపు ముగిశాక టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొడంగల్ అభ్యర్థగా 30వేల ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు.
మరో నియోజకవర్గం కామారెడ్డిలో కూడా రేవంత్‌రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్సెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇక్క ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ దాదాపు మేజిక్ ఫిగర్ లీడింగ్ కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు గెలిచే కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ మారకుండా.. వారిని కాపాడుకునేందుకు ఆ పార్టీ అగ్రనేతలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజ్ కృష్ణలో రూమ్స్ బుక్ చేశారు. ఇక గెలిచిన వారిని వెంటనే బస్సుల్లో కర్ణాటకకు తీసుకెళ్లేందుకు బస్సులను కూడా సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే.