రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
Revanth Reddy Tested Corona Positive. తాజాగా కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.
By Medi Samrat Published on
23 March 2021 9:07 AM GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. భారత్‌లో కూడా కరోనా కేసులు మరోమారు పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా, ధనిక, పేదా తేడా లేకుండా కరోనా ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది. తాజాగా కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశారు.
నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్ కు వెళ్లాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసివారు తగిన జాగ్రత్తలు పాటించండి అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ఇదిలావుంటే.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. తాజాగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిని వాణిదేవి విజయం సాధించారు. కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి నాలుగోస్థానంలో నిలిచారు.
Next Story