కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు : రేవంత్

అచ్చంపేటలో చీమలదండుగా కదలివచ్చిన మిమ్మల్ని చూస్తోంటే.. 50వేల మెజారిటీతో వంశీ గెలుపు ఖాయంగా కనిపిస్తోందని

By Medi Samrat  Published on  21 Nov 2023 11:50 AM GMT
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు : రేవంత్

అచ్చంపేటలో చీమలదండుగా కదలివచ్చిన మిమ్మల్ని చూస్తోంటే.. 50వేల మెజారిటీతో వంశీ గెలుపు ఖాయంగా కనిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అచ్చంపేట ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గువ్వల బాలరాజు రౌడీ మూక ప్రజలపై దాడి చేస్తున్నా.. ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నాం.. ఇక నల్లమల బిడ్డలకు ఓపిక నశించింది.. ఇకనుంచి దాడులను తిప్పికొడతాం.. దాడులు చేసేవాళ్లను ఇక్కడే బొందపెడదామ‌ని పిలుపునిచ్చారు.

తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా ప్రజల స్వప్నం నెరవేరలేదన్నారు. తెలంగాణలో దొరల రాజ్యం కావాలో.. ఇందిరమ్మ రాజ్యం కావాలో నిర్ణయించుకోండన్నారు. గడీల పాలన పోవాలి.. ప్రజా పాలన రావాలన్నారు. ప్రజలు తలుచుకుంటే కేసీఆర్ గడీ నేలమట్టమవుతుందన్నారు. బీఆర్ఎస్‌ ను బొంద పెట్టడం ఖాయమ‌ని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామ‌న్నారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500, రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్, రైతులకు, కౌలు రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు, ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు సాయం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. తెలంగాణలో మార్పు కావాలి... కాంగ్రెస్ రావాలన్నారు.

Next Story