అక్బరుద్దీన్ ఒవైసీని డిప్యూటీ సీఎం చేస్తా: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై
By Medi Samrat Published on 27 July 2024 12:08 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి దగ్గరుండి నామినేషన్ వేయిస్తానని అన్నారు. అంతేకాకుండా అక్బరుద్దీన్ ఒవైసీని ఉపముఖ్యమంత్రిని చేస్తానన్నారు. పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణగుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
పాతబస్తీ మెట్రో నిర్మాణం కోసం ఎల్ అండ్ టీతో చర్చలు జరుపుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం మెట్రో అవసరం లేని మార్గాల్లో మెట్రో నిర్మాణానికి టెండర్లు పిలిచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మిస్తుందన్నారు. పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. అది ఓల్డ్ సిటీ కాదని ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. తాము వచ్చాక పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు విషయమై రీడిజైన్ చేశామన్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించానన్నారు.
Next Story