స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించకపోవడంతో మార్గం సుగమమైంది. గురువారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. గత నెల 29న షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి దశలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 31 జిల్లాల కలెక్టర్లు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ వెంటనే రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు.