తెలంగాణలో 2019 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. వారి నియమకాలు రద్దు చేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా నవంబర్ 18న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
1032 పోస్టులకు 2015లో నోటిఫికేషన్ వచ్చింది. అనేక న్యాయ వివాదాల అనంతరం 2019లో ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అయితే ఆ మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయంటూ ఆ నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేసింది.