తన పేరు తొలగింపుపై హైకోర్టుకు అజారుద్దీన్..కీలక ఆదేశాలిచ్చిన ధర్మాసనం
ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.
By Knakam Karthik
తన పేరు తొలగింపుపై హైకోర్టుకు అజారుద్దీన్..కీలక ఆదేశాలిచ్చిన ధర్మాసనం
ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నార్త్ స్టాండ్ నుంచి మహ్మద్ అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత వారం, HCA అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య నార్త్ స్టాండ్ నుండి అజారుద్దీన్ పేరును తొలగించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ, అజారుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించానని అంబుడ్స్‌మన్ ఆదేశంపై స్టే విధించాలని కోరారు. అజారుద్దీన్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని HCAని ఆదేశించింది.
అయితే.. HCA ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో అజారుద్దీన్ ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు తన పేరును పెట్టుకున్నాడు. అయితే, ఆ నిర్ణయాన్ని అజారుద్దీన్ ఏకపక్షంగా తీసుకున్నాడని లార్డ్స్ క్రికెట్ క్లబ్, HCA అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య.. స్టాండ్ పేరు పెట్టుకోవడంలో అజారుద్దీన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తేల్చారు. దీంతో వెంటనే నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరును తొలగించాలని, టికెట్లపై కూడా ఆయన పేరుతో స్టాండ్ ఉండొద్దని హెచ్‌సీఏను ఈశ్వరయ్య ఆదేశించారు. అయన ఆదేశాలను సవాల్ చేస్తూ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. తాను భారత జట్టుకు కొన్నేళ్ల పాటు ఆడానని, కెప్టెన్‌గా కూడా వ్యవహరించానని కోర్టుకు తెలిపారు. స్టాండ్ పేరు విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదంటూ వాదనను వినిపించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు అంబుడ్స్‌మన్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.