ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్.. నేటి నుంచే 2 నెలల వేసవి సెలవులు
తెలంగాణలో ఇటీవలే ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 31 March 2024 6:15 AM ISTఇంటర్ అకాడమిక్ క్యాలెండర్.. నేటి నుంచే 2 నెలల వేసవి సెలవులు
తెలంగాణలో ఇటీవలే ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలల పాటు హాలీడేస్ ఉండనున్నాయి. జూన్ 1న జూనియర్ కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయి. సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అటు ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌లో వెలువడే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ ఇంటర్ బోర్డు.. ఇంటర్ మొదటి, ద్వితీయ విద్యార్థులకు 2024-25 విద్యాసంవత్సరం తాత్కాలికంగా అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలను జూన్ 1, 2024న రీఓపెన్ చేయాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. అక్టోబర్ 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రకటించింది. సంక్రాంతి సెలవులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 16 వరకు ప్రకటించింది.
48వ ఇంటర్ బోర్డు మీటింగ్ ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో కనీసం 220 రోజుల పాటు ఇంటర్ కాలేజీలు పనిచేయనున్నాయి. 75 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇంటర్ బోర్డు విడుదల చేసే అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లు తీసుకోవాలని అధికారులు ప్రకటనలో తెలిపారు. నవంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. 2025 జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో ప్రారంభం అవుతాయి.