తెలంగాణ ఆస్తులపై బీఆర్‌ఎస్ డాక్యుమెంట్‌ విడుదల

కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సంపాదించిపెట్టిన ఆస్తులపై డాక్యుమెంట్‌ను బీఆర్‌ఎస్ రిలీజ్‌ చేసింది. 51 స్లైడ్స్‌తో బీఆర్‌ఎస్ రిపోర్టును విడుదల చేసింది.

By అంజి  Published on  20 Dec 2023 5:44 AM GMT
BRS, Telangana assets, Congress Govt

తెలంగాణ ఆస్తులపై బీఆర్‌ఎస్ డాక్యుమెంట్‌ విడుదల

నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేయనున్న శ్వేత పత్రాలపై బీఆర్‌ఎస్ కౌంటర్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు, పలు సంస్థల నష్టాలు, దుబారా ఖర్చు, అవినీతిపై ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు పోటీగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సంపాదించిపెట్టిన ఆస్తులపై డాక్యుమెంట్‌ను బీఆర్‌ఎస్ రిలీజ్‌ చేసింది. అసెంబ్లీకి ముందే 51 స్లైడ్స్‌తో బీఆర్‌ఎస్ రిపోర్టును విడుదల చేసింది. పదేళ్లలో సృష్టించిన ఆస్తులు, అభివృద్ధిపై రిపోర్ట్‌ను సిద్ధం చేసింది.

స్లైడ్స్‌లో డిపార్ట్మెంట్‌ల వారీగా ఆస్తుల గురించి వివరించింది. తెలంగాణ వచ్చిన తర్వాత 159 శాతం తెలంగాణ ఆస్తులు పెరిగాయని.. తెలంగాణ సాధించిన తర్వాత ఒక్క రూపాయి అప్పు చేస్తే రూ.1000 అస్తులు సృష్టించామని రిపోర్టులో పేర్కొంది. తలసరి ఆదాయం 151 శాతం పెరిగిందని.. టాక్స్ వసూళ్లు 161 శాతం పెరిగాయని తెలిపింది. రిజిస్ట్రేషన్‌ల ఆదాయం 406 శాతం పెరిగిందని వెల్లడించింది. పంటల ఉత్పత్తి పెరిగిందని తెలిపింది. వరి 150 శాతం, పత్తి 50 శాతం పెరిగిందని తెలిపింది. గతంతో పోల్చితే సాగు విస్తీర్ణం 50 శాతం పెరిగిందని బీఆర్‌ఎస్ పేర్కొంది.



Next Story