చేతబడి చేస్తున్నారని స్తంభానికి కట్టేసి.. దంపతులను దారుణంగా కొట్టిన బంధువులు

Relatives thrash couple accusing them of practising black magic. మెదక్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నారంటూ దంపతులను బంధువులు దారుణంగా కొట్టారు.

By అంజి  Published on  14 Feb 2022 8:54 AM GMT
చేతబడి చేస్తున్నారని స్తంభానికి కట్టేసి.. దంపతులను దారుణంగా కొట్టిన బంధువులు

మెదక్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నారంటూ దంపతులను బంధువులు దారుణంగా కొట్టారు. ఈ అనాగరిక సంఘటన అల్లాదుర్గం గ్రామంలో జరిగింది. చేతబడి చేస్తున్నాడని ఆరోపించిన వారి స్వంత బంధువులే ఒక వ్యక్తి, అతని భార్యను విద్యుత్ స్తంభానికి కట్టేసి నిర్దాక్షిణ్యంగా కొట్టారు. దుండగులు బోయిన రమేష్ (40), అతని భార్య రజిత (38) ఇంటిపై దాడి చేసి, తమపై చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం దంపతులపై దాడి చేసి వీధిలో ఊరేగించారు.

అనంతరం వారిని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ సంఘటన సోమవారం ఉదయం అల్లాదుర్గం గ్రామంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.అయితే, స్థానికులు దాడిని ఆపడానికి, జంటను రక్షించడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. స్తంభానికి కట్టేసి వారిని కొడుతున్న అక్కడున్న స్థానికులు మాత్రం మూగ ప్రేక్షకులుగానే ఉండిపోయారు. కాగా ఈ ఘటన అల్లాదుర్గంలో సంచలనం సృష్టించింది. దాడి గురించి పోలీసులకు సమాచారం అందించడంతో సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మోహన్ రెడ్డి వారిని రక్షించారు. బాధితులను ఆస్పత్రికి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it