సోమ‌వారం ఒక్క‌రోజే టీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం

Record income for TSRTC on Monday.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ఆర్టీసీ)కి రికార్డు స్థాయిలో ఆదాయం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2021 10:30 AM GMT
సోమ‌వారం ఒక్క‌రోజే టీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ఆర్టీసీ)కి రికార్డు స్థాయిలో ఆదాయం వ‌చ్చింది. ఈ నెల 18న‌(సోమ‌వారం) ఒక్క రోజే రూ.14.79కోట్ల ఆదాయం వ‌చ్చింది. ఈ విష‌యాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్ వెల్ల‌డించారు. ఆర్టీసీ బ‌స్సులు సోమ‌వారం ఒక్క‌రోజే 36.30ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల తిరిగాయ‌న్నారు. ఏపీతో పాటు పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, చ‌త్తీస్‌గ‌డ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు కూడా టీఎస్ ఆర్టీసీ సేవ‌ల‌ను వినియోగించుకున్నందుకు స‌జ్జ‌నార్ ధ‌న్యవాదాలు తెలిపారు.

బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా సంద‌ర్భంగా టీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు న‌డిపింది. పండుగ‌కు స్వ‌గ్రామాల‌కు చాలా మంది వెళ్లారు. పండుగ ముగియ‌డంతో సోమ‌వారం చాలా మంది తిరుగుప్ర‌యాణం అయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఆర్టీసీ బ‌స్సుల‌నే ఉప‌యోగించుకున్నారు. ప్ర‌త్యేక బ‌స్సుల‌కు టీస్ఆర్టీసీ ఎటువంటి అద‌న‌పు చార్జీల‌ను వ‌సూలు చేయ‌లేదు. సాధార‌ణ చార్జీల‌నే వ‌సూలు చేయ‌డంతో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించేందుకే మొగ్గు చూపారు. ఫ‌లితంగా ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వ‌చ్చింది.

రికార్డు స్ఠాయిలో ఆదాయం రావ‌డంతో టీఎస్ఆర్టీసీ చైర్మ‌న్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ కూడా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క సిబ్బందికి పేరు పేరున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

Next Story
Share it