తెలంగాణ కొత్తగా సీఎస్‌గా రామకృష్ణరావు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్స్ జరిగాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30వ తేదీన పదవీవిరమణ చేయనున్నారు. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణ రావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.