మంత్రి పదవికి నేనూ అర్హుడినే, అదొక్కటే మైనస్ అయ్యింది: కాంగ్రెస్ ఎమ్మెల్యే

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు

By Knakam Karthik
Published on : 29 July 2025 5:08 PM IST

Telangana, Congress Mla Makkan Singh Thakur, State Cabinet

మంత్రి పదవికి నేనూ అర్హుడినే, అదొక్కటే మైనస్ అయ్యింది: కాంగ్రెస్ ఎమ్మెల్యే 

తెలంగాణ కేబినెట్‌లో తనకు చోటు లభించకపోవడంపై రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను మంత్రి ప‌ద‌వికి మోస్ట్ ఎలిజిబుల్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లోని బీసీ ఎమ్మెల్యేలకు అదనపు పదవులు ఉన్నాయని తనకు మాత్రం ఎలాంటి పదవులు లేవని అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో అందరికీ పదవులు రావడమే తనకు మైనస్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే అదే పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే వివేక్‌, శ్రీధర్ బాబులకు మంత్రి పదవులు దక్కాయి. ఇక గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ తాను కూడా అర్హుడినే అని మక్కన్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఆయన మంత్రి పదవిని ఆశించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చాలా కాలంగా పెద్దపల్లి పార్లమెంట్‌లో పార్టీకి సేవచేయడంతో ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో మరోసారి మక్కన్ సింగ్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. కాగా మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీపై రాష్ట్రంలో ఎక్కువ చర్చ జరుగుతుంది. పార్టీకి కామన్ మ్యాన్‌గా సేవ చేస్తుంది. మాకు కలసి వచ్చే అంశం ఇదే..అని రాజ్ ఠాకూర్ చిట్‌చాట్‌లో మాట్లాడారు.

Next Story