తెలంగాణలో హాట్‌టాపిక్‌గా రాఖీ.. భయపడితే ఎలా అంటూ కేటీఆర్ పోస్ట్
తెలంగాణలో రాఖీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 8:54 AM ISTతెలంగాణలో హాట్‌టాపిక్‌గా రాఖీ.. భయపడితే ఎలా అంటూ కేటీఆర్ పోస్ట్
తెలంగాణలో రాఖీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రాఖీకి కూడా భయపడితే ఎలా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. చేతి నిండా రాఖీలు కట్టుకున్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. కొందరు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. ఇంకొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తిప్పికొడుతున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ సభ్యులు పలువురు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. కేటీఆర్‌కు రాఖీలు కట్టిన సభ్యులందరికీ కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. దాంతో.. కేటీఆర్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటిసుల మేరకు కేటీఆర్.. కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే, మహిళా కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చిన కేటీఆర్‌ను కాంగ్రెస్ మహిళా నేతలు అడ్డుకున్నారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక చివరకు కార్యాలయంలోకి వెళ్లిన కేటీఆర్‌కు పలువురు సభ్యులు రాఖీలు కట్టారు. దాంతో.. మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఆరుగురు మహిళా సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సెక్రటరీని కమిషన్ చైర్‌పర్సన్ నేరేళ్ల శారద ఆదేశించారు.
సభ్యులు నిష్పాక్షికంగా ఉండాలని ముందే హెచ్చరించినట్లు నేరెళ్ల శారద చెప్పారు. కమిషన్ కార్యాలయంలోకి ఫోన్లు కూడా తేవొద్దని చెప్పామన్నారు. అయినా కూడా రహస్యంగా తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలను చిత్రీకరించారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో శారద అభ్యంతరం తెలిపారు. కాగా.. కేటీఆర్ చేతి నిండా రాఖీలు కట్టుకొని ఉన్న ఫోటో కూడా వైరల్ అవుతోంది. కల్వకుంట్ల తారక రామారావు ఫోటోను రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పోల్చుతూ సేమ్ టు సేమ్ అంటూ కొంత మంది యూజర్లు కామెంట్ చేశారు.
రాఖీకి కూడా భయపడితే ఎలా? pic.twitter.com/6H2Pk7afu2
— KTR (@KTRBRS) August 24, 2024