Telangana: లంచం తీసుకుంటూ దొరికిన అధికారి.. తప్పు చేయనట్టు ఫొటోలకు ఫోజులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అర్రామ్‌ రెడ్డి అమరేందర్‌ నిన్న రాత్రి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

By అంజి
Published on : 10 May 2025 10:34 AM IST

Rajanna Sircilla District, Irrigation Executive Engineer, ACB, bribe

Telangana: లంచం తీసుకుంటూ దొరికిన అధికారి.. తప్పు చేయనట్టు ఫొటోలకు ఫోజులు 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అర్రామ్‌ రెడ్డి అమరేందర్‌ నిన్న రాత్రి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అవినీతికి పాల్పడినందుకు కొంచెం కూడా విచారం, భయం, బాధ లేకుండా దర్జాగా ఫొటోలకు ఫోజులిచ్చాడు. తప్పు చేసినా పొగరు మాత్రం తగ్గలేదని ఆయనపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ పెండింగ్‌ బిల్లులను రిలీజ్‌ చేసేందుకు ఆయన భారీ మొత్తంలో వసూలు చేసినట్టు తెలుస్తోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డివిజన్-నం. 7, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రామ్ రెడ్డి అమరేందర్ రెడ్డి ఓ ఫిర్యాదుదారుడి నుండి రూ. 60,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు తెలంగాణ ఎసిబి పట్టుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలం అవునూరు, అగ్రరం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణం కోసం కాంట్రాక్ట్ పనికి సంబంధించిన రూ. 50 లక్షల బిల్లును మంజూరు చేసేందు నిందితుడు లంచం డిమాండ్ చేశాడు.

ఎసిబి అధికారులు రావడాన్ని గమనించిన నిందితుడు లంచం డబ్బును తన కొడుకు టీ-షర్టులో ముట్టుకోకుండా చుట్టి ఇంటి కాంపౌండ్ గోడ వెలుపల విసిరాడు. నిందితుడి నివాస గృహం వెనుక ఉన్న బహిరంగ స్థలం నుండి రూ. 60,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకున్న టీ-షర్టులో కొంత భాగం రసాయన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఆ విధంగా నిందితుడైన అధికారి అనవసర ప్రయోజనం పొందడానికి తన విధిని అక్రమంగా, నిజాయితీ లేకుండా నిర్వర్తించాడని అధికారులు గుర్తించారు.

Next Story