తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్ కు పేరు మారింది. ఇప్పటి వరకు “రాజ్ భవన్, తెలంగాణ”గా పిలుస్తున్న ఈ అధికారిక నివాసాన్ని ఇకనుంచి “లోక్ భవన్, తెలంగాణ”గా వ్యవహరించనున్నట్లు గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
లోక్ భవన్ పేరును అమల్లోకి తేవడం ద్వారా, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న సమయంలో ప్రజాస్వామ్య విలువల బలాన్ని, ప్రజల ప్రాధాన్యతను మరింత స్పష్టం చేయాలని ఈ నిర్ణయంతో ప్రభుత్వం భావించింది.కొత్త పేరుతో సంబంధించిన మార్పులు, అన్ని అధికారిక పత్రాలు, రికార్డులు, ప్రభుత్వ కమ్యూనికేషన్లలో తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు