తెలంగాణకు వాతావరణ శాఖ తీపికబురు.. మూడ్రోజుల పాటు వర్షాలు

తెలంగాణకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది

By Knakam Karthik
Published on : 25 Jun 2025 5:30 PM IST

Telangana, Weather Update, Rain Alert, Yellow Alert

తెలంగాణకు వాతావరణ శాఖ తీపికబురు..మూడ్రోజుల పాటు వర్షాలు

తెలంగాణకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, వాయువ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం :

హైదరాబాద్ సిటీలో పలు ఏరియాల్లో మధ్యాహ్నం సమయంలో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు వాతావరణం చల్లబడింది. దీంతో ఒక్కసారిగా వర్షం పడింది. సికింద్రాబాద్, బోయిన్​ పల్లి, తిరుమలగిరి, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం నీరు రహదారులపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Next Story