తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
By Knakam Karthik
తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మొదటి రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత రెండు రోజులు మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని హెచ్చరించింది.
రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. హైదరాబాద్‌లో భారీ వర్షం నిన్నటి నుంచి కురుస్తూనే ఉంది. రానున్న నాలుగు రోజులు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అనవసరంగా ప్రజలు బయటకు రాకుండా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.