హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కాగా సిటీకి మళ్లీ వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. శనివారం హైదరాబాద్‌లో వర్షాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది,అనేక శివారు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం సమయంలో వాతావరణ హెచ్చరిక జారీ చేయబడి గంటల్లోపు వర్షం పడుతుందని హెచ్చరించింది, తరువాత మధ్యాహ్నం 2:30 తర్వాత మరిన్ని వర్షాలు కురుస్తాయి..అని వాతావరణ శాఖ పేర్కొంది.
రానున్న రెండు గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనీ బీరంగూడ, ఆర్‌సీ పురం, మియాపూర్, సెరిలింగంపల్లి, చంద్రాయణగుట్ట, హయత్‌నగర్, బాలాపూర్, షంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. మధ్యాహ్నం 2:30 తర్వాత ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ ప్రజలకు సూచించింది.