రాష్ట్రంలో కేసీఆర్ కారు పంక్చర్ అయ్యింది : రాహుల్ గాంధీ

రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. నిజామాబాద్ లో ఆయ‌న మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  25 Nov 2023 4:29 PM IST
రాష్ట్రంలో కేసీఆర్ కారు పంక్చర్ అయ్యింది : రాహుల్ గాంధీ

రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. నిజామాబాద్ లో ఆయ‌న మాట్లాడుతూ.. కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం చేశారని.. ధరణి పోర్టల్ తో ఎమ్మెల్యేల‌కు భూములు అప్పగిస్తున్నారని ఆరోపించారు. మోదీ కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేన‌ని.. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కారు పంక్చర్ అయ్యిందన్నారు.

బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ నల్లచట్టాలు చేసి రైతులకు మోసం చేసింద‌న్నారు. నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారు.. నా ఇళ్ళు తొలగించారని తెలిపారు. బీజేపీ వాళ్ళ ఇళ్ళు వద్దు.. దేశంలోని ప్రజల ఇళ్ళు నావి.. వారు నా మనసులో వున్నారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వంకు కేసీఆర్ అని విధాలుగా సహకరిస్తున్నారని ఆరోపించారు. అక్కడ నరేంద్రమోదీ, ఇక్కడ కేసీఆర్ ఒకటేన‌న్నారు. నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు కోరారు. అనంతరం రాష్ట్ర మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్లు కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ.

Next Story