వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన ఓయువకుడు జాతీయ కోటాలో సీటు సాధించి కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. కాగా.. సదరు విద్యార్థిని మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డాడు. అతడి దుస్తులు విప్పించి మరీ ర్యాగింగ్ పాల్పడ్డారు.
ఈ విషయాన్ని సదరు విద్యార్థి కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. కుటుంబ సభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువచ్చారు. దీంతో డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం వరంగల్ కేసీఎంసీకి వచ్చి ర్యాగింగ్ ఘటనపై ఆరా తీశారు. ఈ విషయమై కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ర్యాగింగ్ చేసిన ముగ్గురు విద్యార్థులు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగిందన్నారు. ఇదిలా ఉంటే.. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం వారి క్షమాపణతో శాంతించలేదని తెలుస్తోంది.