యాదాద్రి దర్శనానికి ఏర్పాట్లు ఎన్నో
QR enabled tickets machine to make Ladoos New Facilities for Devotees in Yadadri.యాదగిరిగుట్ట ఆలయం ఐదేళ్ల తర్వాత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 March 2022 1:33 PM ISTయాదగిరిగుట్ట ఆలయం ఐదేళ్ల తర్వాత తిరిగి తెరవబడుతోంది. భక్తులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా దర్శనం కోసం యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటిడిఎ) అనేక చర్యలు చేపట్టింది. కొత్తగా నిర్మించిన ఆలయాన్ని మార్చి 28న ప్రజలకు తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉంది. ఏడు గోపురాలు, ద్రావిడ శిల్పకళతో పాటు అనేక ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి.
వైటీడీఏ వైస్ చైర్మెన్ జి. కిషన్‌రావు న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ.. "ప్రసాదాలను తీసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి ఉండడం, వాటికి డిమాండ్ ఎక్కువగా ఉండడం సవాల్ తో కూడుకున్నది. ప్రస్తుతానికి కొత్త ఆలయం తెరుచుకోనప్పటికీ రాబోయే రోజుల్లో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.. ప్రసాదంకు డిమాండ్ కూడా ఎక్కువవ్వనుంది. పొడవైన క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. ఏప్రిల్ నుండి, లడ్డూలను తయారు చేయడానికి మెకనైజ్డ్ మెషినరీని కలిగి ఉంటాము." అని తెలిపారు. గతంలో యాదాద్రిగుట్టలో లడ్డూలను చేతితో తయారు చేశారని.. ఇప్పుడు ముడిసరుకుతో అన్ని లడ్డూలను ఒక యంత్రం రోల్ చేస్తుందని శ్రీ కిషన్ రావు వివరించారు. యంత్రాలను ఉపయోగించి ఒకేసారి 50,000 లడ్డూలను ఉత్పత్తి చేయగలుగుతామని ఆయన చెప్పారు. దీని వల్ల లడ్డూ నాణ్యత లేదా పరిమాణం మారదని ఆయన హామీ ఇచ్చారు. వైటీడీఏ బస్ స్టేషన్ నుండి కొండపైకి ఉచిత బస్ సర్వీస్ ను కూడా అందిస్తుంది. ఆలయాన్ని సందర్శించే యాత్రికులందరికీ నిత్య అన్నదానం సదుపాయం ఉండనుంది.
కొండపైన దాదాపు 20 టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పెద్ద లైన్లను తగ్గించి రెండు నిమిషాల్లో టిక్కెట్లు జారీ చేయడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అన్ని టిక్కెట్లు క్యూఆర్ కోడ్‌లతో ప్రారంభించబడతాయని కిషన్ రావు అన్నారు. ప్రతి గంటకు టిక్కెట్లు జారీ చేయబడతాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) QR-కోడెడ్ టిక్కెట్ల నిర్వహణను చూసుకుంటుంది. భక్తులు క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన తర్వాత గంటలోపు వారి దర్శనం పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు.
అదనంగా, కోనేరు (కృత్రిమ చెరువు) కొండపై నిర్మించబడింది, దీని వలన యాత్రికులు సంప్రదాయాల ప్రకారం, ఇతర దక్షిణ భారత దేవాలయాల మాదిరిగానే అందులో మునిగి దర్శనానికి వెళతారు. కోనేరులో ఒకేసారి 300 మంది పురుషులు, 300 మంది మహిళలు వెళ్లవచ్చని పుణ్యస్నానం ఆచరించవచ్చని తెలిపారు. "తలనీలాలు ఇవ్వడానికి.. ఒకేసారి 400 మంది వరకు ఇచ్చేలా కాంప్లెక్స్ నిర్మించబడింది," కిషన్ రావు తెలిపారు.
"కొత్తగా 'లక్ష్మీ పుష్కరిణి' ని నిర్మించగా.. పాత కోనేరు 'విష్ణు పుష్కరిణి' లో మార్పులు చేశారు. అభిషేకం, బ్రహ్మోత్సవం వంటి నరసింహ స్వామికి సంబంధించిన ఆచారాలకు మాత్రమే విష్ణు పుష్కరిణి ఉపయోగించబడుతుంది," అన్నారాయన. బాలాలయాన్ని రంగమండపంగా మార్చి ప్రత్యేక రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రథయాత్ర, బ్రహ్మోత్సవాలు, సత్యనారాయణ వ్రతం, పుష్కరిణిలు వంటివి కొత్త ఆలయానికి జోడించబడ్డాయి.
భద్రత- సౌకర్యాలు
యాదిగిరిగుట్ట, ఆలయ పరిసర ప్రాంతాలు రెండూ సురక్షితంగా ఉండేలా చూసేందుకు, ఆలయం అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాయగిరి సరస్సు వంతెనపై కూడా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. "ఇంతకుముందు, ఆలయ పరిసరాల్లో లిఫ్టులు లేదా ఎస్కలేటర్లు లేవు. ఇప్పుడు, ఆలయంలో రెండు లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉన్నాయి, వీటిని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. వీటిని సీనియర్ సిటిజన్లు, శారీరక వికలాంగులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు," అని కిషన్ రావు అన్నారు.
గుహలోని అసలు ఆలయాన్ని ప్రజలకు మూసివేయబడిన తర్వాత, భక్తుల కోసం కొండపై ఉన్న ప్రత్యామ్నాయ ఆలయం, బాలాలయం తెరవబడింది. "అక్కడ దర్శనాలు ఎన్నడూ తగ్గలేదు. దాని నుండి వచ్చే ఆదాయం కూడా చాలా బాగుంది. ఇప్పుడు, ఆలయం తిరిగి తెరిచిన తర్వాత, అక్కడ రంగమండపం (వివిధ ఆచారాలకు ఉపయోగించబడుతుంది) నిర్మించబడుతుంది," అని ఆయన చెప్పారు.
యాత్రికులకు వసతి
ప్రస్తుతం యాదాద్రిలో దాదాపు 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని కిషన్‌రావు తెలిపారు. "ఆలయం చుట్టూ రియల్ ఎస్టేట్ కూడా అభివృద్ధి చెందుతోంది. ఆలయ ప్రక్కనే ఉన్న కొండలపై అనేక ప్రెసిడెన్షియల్ సూట్లు, అతిథి గృహాలు కూడా నిర్మించబడ్డాయి," అన్నారాయన. ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే త్వరలో 'టెంపుల్ సిటీ' రాబోతుందని చెప్పారు. "ఈ టెంపుల్ సిటీలో ఫైవ్ స్టార్ హోటళ్లు, హాస్పిటల్స్, ఫ్లాట్లు అన్నీ ఉంటాయి. ఇది యాదాద్రిలో ఆలయానికి సమీపంలోనే ఉంటుంది" అని ఆయన చెప్పారు.