ఓ మహిళగా.. నాకు, నా బిడ్డకు న్యాయం చేయండి : రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ య‌జ‌మాని కోడ‌లు లేఖ‌

PullaReddy Sweets owner daughter in law Pragna Reddy letter to President Draupadi Murmu. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్యారెడ్డిల

By M.S.R  Published on  26 Dec 2022 4:19 PM IST
ఓ మహిళగా.. నాకు, నా బిడ్డకు న్యాయం చేయండి : రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ య‌జ‌మాని కోడ‌లు లేఖ‌

పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ఆ ఇంటి కోడలు ప్రజ్ఞారెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. వీరంతా కలిసి గత రెండేళ్లుగా తనను, తన ఎనిమిదేళ్ల కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజ్ఞారెడ్డి ఆరోపించారు. గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను గదిలోంచి బయటికి రానివ్వకుండా రాత్రికి రాత్రే గోడ కట్టేశారని.. కోర్టు స్పందించి, ఆ గోడ కూల్చేయాలని చెప్పిందని ప్రజ్ఞారెడ్డి తెలిపారు. తనను, తన కుమార్తెను చంపేందుకు ప్రయత్నించారని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మహిళగా సాటి మహిళ వేదనను అర్థం చేసుకుంటారన్న ఆలోచనతో మీకు ఈ లేఖ రాస్తున్నాను... నాకు, నా బిడ్డకు న్యాయం చేయండి అంటూ ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. పుల్లారెడ్డి స్వీట్స్ వ్యవస్థాపకుడు జి.పుల్లారెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు జి.రాఘవరెడ్డి పుల్లారెడ్డి గ్రూప్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఆయన కుమారుడు ఏక్ నాథ్ రెడ్డికి 2014లో ప్రజ్ఞారెడ్డితో వివాహం జరిగింది. ప్రజ్ఞారెడ్డి తండ్రి కేఆర్ఎం రెడ్డి మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. పెళ్లి తర్వాత కొంతకాలానికే ఏక్ నాథ్ రెడ్డి, ప్రజ్ఞారెడ్డిల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నాంటూ ప్రజ్ఞారెడ్డి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story