రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న భట్టి

తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

By Knakam Karthik
Published on : 19 March 2025 11:43 AM IST

Telangana, Assembly Budget Sessions, Deputy Cm Bhatti

రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న భట్టి

తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. "తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రతి చర్యనూ నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు” అని భట్టి విక్రమార్క అన్నారు.

ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా.. పారదర్శకత జవాబుదారీతనంలో ప్రభుత్వం సాగుతోందని అన్నారు. జోడు గుర్రాల సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని నమ్ముతున్నామని అన్నారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని తెలిపారు. గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోని దాటేశామని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు మూసీ సుందరీకరణ, మెడికల్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించామని అన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేలా కేటాయింపులు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు తెలిపారు.

శాఖల వారీగా కేటాయింపులు ఇలా..

రైతు భరోసా కోసం - 18వేల కోట్లు

వ్యవసాయ శాఖ - 24,439 కోట్లు

పశు సంవర్డక శాఖ - 1,674

సివిల్ సప్లై - 5,734 కోట్లు

విద్యా శాఖ - 23,108 కోట్లు

కార్మిక ఉపాధి కల్పన - 900 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ - 31,605 కోట్లు

మహిళా శిశు సంక్షేమ శాఖ - 2862 కోట్లు

ఎస్సి సంక్షేమం - 40,232 కోట్లు

ఎస్టీ సంక్షేమం - 17,169 కోట్లు

బీసీ సంక్షేమం - 11,405 కోట్లు

చేనేతకు - 371 కోట్లు

మైనార్టీ సంక్షేమం - 3,591 కోట్లు

పరిశ్రమల శాఖ - 3,527 కోట్లు

ఐటి - 774 కోట్లు

ఉచిత విద్యుత్ - 3వేల కోట్లు

విద్యుత్ శాఖ - 21,221 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖ - 12,393 కోట్లు

MAUD - 17,677 కోట్లు

ఇరిగేషన్ - 23,373 కోట్లు

రోడ్లు భవనాలు - 5,907 కోట్లు

పర్యాటక శాఖ - 775 కోట్లు

క్రీడా శాఖ- 465 కోట్లు

అటవీ శాఖ - 1023 కోట్లు

దేవాదాయ శాఖ - 190 కోట్లు

హోం శాఖ - 10,188 కోట్లు

Next Story