వరద నీటిలో చిక్కుకున్న ప్రైవేటు పాఠ‌శాల బ‌స్సు

Private School bus stuck in flood water in Mahabubnagar District.మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో జిల్లాలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2022 12:19 PM IST
వరద నీటిలో చిక్కుకున్న ప్రైవేటు పాఠ‌శాల బ‌స్సు

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో జిల్లాలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఓ ప్రైవేటు పాఠ‌శాల బ‌స్సు వ‌ర‌ద నీటిలో చిక్కుకుంది. స్పందించిన స్థానికులు విద్యార్థుల‌ను బ‌స్సులోంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. ఈ ఘ‌ట‌న కోడూరు వ‌ద్ద చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలో ఇటీవ‌ల విస్తారంగా కురుస్తున్న వ‌ర్షాల‌కు కోడూరు-మాచన్‌పల్లి మార్గంలోని రైల్వే అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద భారీగా వ‌ర‌ద‌నీరు చేరుకుంది. రామచంద్రపూర్‌, మాచన్‌పల్లి, సుగుర్గడ్డ తండా నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులు స్కూలు బస్సులో వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో రైల్వే అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద వ‌ర‌ద‌నీటిలో బ‌స్సు చిక్కుకుంది. స‌గబాగం వ‌ర‌కు బ‌స్సు నీటిలో మునిగిపోయింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 30 మందికి పైగా విద్యార్థులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ‌స్సులోకి నీరు రావ‌డంతో విద్యార్థులు కేక‌లు పెట్టారు. గ‌మ‌నించిన స్థానికులు విద్యార్థుల‌ను బ‌స్సుల్లోంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. అనంత‌రం బ‌స్సును ట్రాక్ట‌ర్ సాయంతో బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికి ఎటువంటి గాయాలు, ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Next Story