ప్రైవేటు బస్సు బోల్తా.. 17 మందికి తీవ్ర‌గాయాలు

Private Bus OverTurned in Nirmal.ఓ ప్రైవేటు బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 17 మంది ప్ర‌యాణీకుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2021 8:47 AM IST
ప్రైవేటు బస్సు బోల్తా.. 17 మందికి తీవ్ర‌గాయాలు

ఓ ప్రైవేటు బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 17 మంది ప్ర‌యాణీకుల‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి. మ‌రో 15 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న నిర్మ‌ల్ జిల్లాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు బ‌స్సు హైద‌రాబాద్ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వెలుతోంది. బుధ‌వారం తెల్ల‌వారుజామున కొండ‌పూర్ బైపాస్ వ‌ద్ద అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 80 మంది ప్ర‌యాణీలు ఉన్న‌ట్లు స‌మాచారం.

వీరిలో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ‌గా.. మ‌రో 15 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. కాగా.. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిందా..? లేదా ఇత‌ర ఏ కార‌ణం చేత‌నైనా ప్ర‌మాదం జ‌రిగిందా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Next Story