శివరాత్రి వేడుకలో విషాదం.. గుండెపోటుతో అర్చకుడు మృతి

Priest dies of heart attack while performing Shivaratri poojas in Khammam. ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి వేళ విషాద ఘటన చోటు చేసుకుంది.

By అంజి  Published on  19 Feb 2023 10:42 AM IST
శివరాత్రి వేడుకలో విషాదం.. గుండెపోటుతో అర్చకుడు మృతి

ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో శనివారం శ్రీరామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా అర్చకుడు గుండెపోటుతో మృతి చెందాడు. శివరాత్రి జాతరలో భాగంగా గ్రామంలోని జాతరలో నది వద్ద పూజారి అమదేపురపు వెంకటేశ్వర్లు (48) శివుడికి ప్రార్థనలు నిర్వహిస్తుండగా, గుండెపోటుతో కుప్పకూలి నిమిషాల వ్యవధిలో మరణించాడు. స్థానిక ఎస్‌ఐ ఎస్‌ వీరప్రసాద్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం అన్నారుగూడెంకు చెందిన మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మరో ఘటనలో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా అజ్నికి చెందిన డొంగ్రే ప్రదీప్‌ (25) నిర్మల్‌ జిల్లా బాసర గోదావరి నదిలో పుణ్యస్నానానికి దిగి ప్రమాదవసాత్తు నీట మునిగి చనిపోయాడు. ఇదిలా ఉంటే నిన్న శివనామస్మరణలతో రాష్ట్రంలోని శైవక్షేత్రాలు మార్మోగిపోయాయి. శనివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

Next Story