తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ చౌర్యం..!

Power thefts on the rise in Telangana.తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చౌర్యం జ‌రుగుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2023 3:41 AM GMT
తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ చౌర్యం..!

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చౌర్యం జ‌రుగుతోంది. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) పరిధిలోని ప్రాంతాల్లో 2022లో 64,245 కేసులు నమోదయ్యాయి. ఇది 2021లో బుక్ చేసిన వాటి కంటే 3,000 ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం.

మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అక్రమ విద్యుత్ వినియోగానికి పాల్పడిన వినియోగదారుల నుంచి సంస్థ‌ రూ.3,994.67 లక్షల జరిమానా వసూలు చేసింది. ఇది కాకుండా తప్పు చేసిన వినియోగదారుల నుంచి రూ.739.11 లక్షల మొత్తాన్ని కాంపౌండింగ్ మొత్తంగా వసూలు చేశారు. ఒకటి కంటే ఎక్కువసార్లు విద్యుత్ చోరీలకు పాల్పడిన వ్యక్తులపై 219 కేసులు నమోదు కాగా.. గతేడాది 204 మందిని జైలుకు పంపారు.

TSSPDCL చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కె మురళీధర్ రావు ప్రకారం 90 శాతానికి పైగా విద్యుత్ చౌర్యం డొమెస్టిక్ కేటగిరీలో జరుగుతున్నాయి. వాణిజ్య కేటగిరీలో చౌర్యం జ‌రుగుతోందన్నారు.

విద్యుత్‌ను అక్రమంగా వినియోగించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే వారిపై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. నేరస్తులపై కేసులు నమోదు చేసేందుకు కంపెనీ విజిలెన్స్ అధికారులు రెగ్యులర్‌గా దాడులు నిర్వహిస్తున్నారని చెప్పారు.

ఇంధన శాఖ అధికారుల ప్రకారం ప్రతి సంవత్సరం విద్యుత్ చోరీల వల్ల మొత్తం ఆదాయంలో 10 శాతం కోల్పోతున్నారు. విద్యుత్ చౌర్యం వల్ల వినియోగానికి ఆదాయ నష్టం వాటిల్లుతుందని, స్థానిక ప్రాంత సరఫరాకు అంతరాయం కలుగుతుందని, వైర్లు, కేబుల్స్‌ ట్యాంపరింగ్‌ వల్ల ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ నష్టాలు పెరుగుతాయని ఓ అధికారి తెలిపారు.

విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 126 ప్రకారం అనధికారికంగా విద్యుత్ వినియోగం శిక్షార్హమైనది. విద్యుత్ చౌర్యానికి పాల్ప‌డితే జ‌రిమానాలు విధించ‌డంతో పాటు కేసులు న‌మోదు చేస్తారు.

Next Story