గుడ్ న్యూస్ చెప్పిన పౌల్ట్రీ కంపెనీలు

తెలంగాణ రాష్ట్రంలో చికెన్‌ సెంటర్ల బంద్‌ విజయవంతమైంది. పౌల్ట్రీ కంపెనీలు బర్డ్‌ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించాయి

By -  Knakam Karthik
Published on : 2 April 2026 12:36 PM IST

Telangana, PoultryNews, ChickenPrices, TelanganaPoultry, RetailMargins

గుడ్ న్యూస్ చెప్పిన పౌల్ట్రీ కంపెనీలు

తెలంగాణ రాష్ట్రంలో చికెన్‌ సెంటర్ల బంద్‌ విజయవంతమైంది. పౌల్ట్రీ కంపెనీలు బర్డ్‌ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించాయి. చికెన్‌ సెంటర్ల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్‌ను గతంలో మాదిరిగానే కిలోకు రూ.15, ఆ పైన మార్జిన్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

చికెన్‌ సెంటర్ల నిర్వా హకులు బంద్‌ను విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఉమ్మడి వరంగల్‌ జిల్లా బ్రాయిలర్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు తెలిపారు. బంద్‌ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

చికెన్‌ సెంటర్ల బంద్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌ లోని ఇందిరా పార్క్‌ వద్ద జరిగిన మహా ధర్నాలో పలు జిల్లాల నుంచి చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని నినాదాలు చేశారు.

Next Story