తగ్గేదే లే.. హైదరాబాద్ జనాభా ఎంతో తెలుసా?
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న హైదరాబాద్.. జనాభా విషయంలో కూడా తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా ఒక కోటి
By అంజి Published on 20 April 2023 1:30 PM ISTతగ్గేదే లే.. హైదరాబాద్ జనాభా ఎంతో తెలుసా?
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న హైదరాబాద్.. జనాభా విషయంలో కూడా తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా ఒక కోటి 5 లక్షలకు చేరుకుందని, ఈ ఏడాది చివరి నాటికి ఆ సంఖ్య ఒక కోటి 8 లక్షలకు చేరనుందని యునైటేడ్ నేషన్స్ పాపులేషన్ డివిజన్ లేటెస్ట్‌గా అంచనా వేసింది. జనాభా పరంగా హైదరాబాద్ దేశంలోనే 6వ స్థానంలో ఉంది. ఇక ప్రపంచంలో 34వ స్థానంలో ఉంది. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలోని జనాభాలో 3వ వంతు రాజధానిలోనే నివాసం ఉంటోంది. కోటికి పైగా ఉన్న హైదరాబాద్ జనాభాలో 25 శాతం వరకు 14 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారు.
ఇక 15 నుంచి 64 ఏళ్ల వయస్సు ఉన్న వారు 60 శాతానికిపైగా ఉన్నారు. 1950లో హైదరాబాద్ జనాభా 10 లక్షలకుపైగా ఉండగా, 1990 నాటికి సుమారు 40 లక్షలకుపైగా పెరిగింది. ఇప్పుడు జనాభా కోటికి దాటింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 650 చదరపు కిలోమీటర్లకు విస్తరించి ఉంది. ఉపాధి కోసం ఏటా సుమారు 5 లక్షల మంది నగరానికి వలసవచ్చి, ఇక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌కు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రతి ఏటా వచ్చే వారి సంఖ్య 4.07 లక్షలుగా ఉందని, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య 88 వేలకుపైగా ఉందని యునైటేడ్ నేషన్స్ అంచనా వేసింది.
ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల లిస్ట్‌లోనూ హైదరాబాద్‌కు చోటు దక్కింది. మొదటి స్థానం న్యూయార్క్ సిటీకి దక్కగా.. హైదరాబాద్‌కు 65వ స్థానం దక్కింది. హైదరాబాద్‌లో 11,100 మంది మిలియనీర్లు ఉన్నారు.