అడ్లూరిపై వ్యాఖ్యల దుమారం, పొన్నం ఏమన్నారంటే?

సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు

By -  Knakam Karthik
Published on : 8 Oct 2025 11:28 AM IST

Telangana, Minister Ponnam Prabhakar,Adluri Laxman Kumar, deliberate comments

అడ్లూరిపై వ్యాఖ్యల దుమారం, పొన్నం ఏమన్నారంటే?

హైదరాబాద్: సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు నాకు సోదరులవంటివారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగింది. ఎవరు విడదీయరానిది.

నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదు. అయితే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటివారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నాను.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో,రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై మేము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తాం...అని పొన్నం ట్వీట్ చేశారు.

Next Story