ప్రచారంలో భాగంగా డప్పు కొడుతూ స్టెప్పులేసిన పొన్నం ప్రభాకర్

తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  4 Nov 2023 5:53 AM GMT
ponnam prabhakar, dance, congress, husnabad,

ప్రచారంలో భాగంగా డప్పు కొడుతూ స్టెప్పులేసిన పొన్నం ప్రభాకర్

తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ప్రచార హోరు కనిపిస్తోంది. ర్యాలీలు.. పాదయాత్రలు.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ కొందరు నాయకులు వినూత్నంగా ప్రచారం చేస్తుంటారు. ప్రజల మెప్పు పొందేందుకు పలు హామీలను ఇవ్వడమే కాదు.. రకరకాల పనులు చేస్తూ ప్రజల దృష్టిలో పడుతుంటారు. ఈ క్రమంలోనే పొన్నం ప్రభాకర్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఊరికే పాల్గొనకుండా కళాకారులతో కలిసి డప్పు వాయించి స్టెప్పులేశారు. పొన్నం ప్రభాకర్‌ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌ బరిలోకి దిగారు. యూత్‌ కాంగ్రెస్‌తో కార్యకర్తలతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహిస్తూ హుస్నాబాద్‌ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లారు పొన్నం ప్రభాకర్‌రెడ్డి. అయితే.. హుస్నాబాద్‌ మండలంలోని కూచనపల్లిలో నివాసం ఉంటోన్న మహిళలందరూ కలిసి వినూత్న పద్దతిలో కోలాటం ఆడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు స్వాగతం పలికారు. పలుగ్రామాల్లో బైక్‌పై పార్టీ శ్రేణులతో పాటు తిరిగిన పొన్నం ప్రభాకర్‌ తనని గెలిపించాలంటూ పక్రజలను విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచారంలో భాగంగా పాల్గొన్న డప్పు కళాకారులతో కలిసి పొన్నం ప్రభాకర్‌ కూడా డప్పు వాయించారు. అంతేకాదు.. వారు గుండ్రంగా తిరుగుతూ స్టెప్పులేస్తే.. ఆయన కూడా డప్పు చప్పుడు చేస్తూ డ్యాన్స్ చేశారు. పొన్నం ప్రభాకర్‌ డప్పు కొడుతూ డ్యాన్స్‌ చేయడం చూసిన కార్యకర్తలు, అభిమానులు ఎంతో సంబరపడిపోయారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

Next Story