Video : ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఇంటి బ‌య‌ట‌ ఒంగోలు పోలీసులు

దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) అరెస్ట్‌కు రంగం సిద్ధమైన‌ట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు.

By Kalasani Durgapraveen  Published on  25 Nov 2024 12:12 PM IST
Video : ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఇంటి బ‌య‌ట‌ ఒంగోలు పోలీసులు

దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) అరెస్ట్‌కు రంగం సిద్ధమైన‌ట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్‌ పీఎస్‌లో విచారణకు ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరుకాకపోవడంతో అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ నిమిత్తం ఈరోజు ఉదయం 11 గంటలకు వర్మ హాజరు కావాల్సివుంది.. కానీ వర్మ ఒంగోలుకు రావడం లేదని తెలియడంతో పోలీసు బృందం ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. వర్మ విచారణకు సహకరించకుంటే అరెస్టు చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తుంది. వ‌ర్మ‌ అరెస్టు చేసి ఒంగోలు తీసుకెళ్లి విచారించనున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆర్జీవి ఇంటికి ఇద్దరు ఎస్సైలతో పాటు ఆరుగురు పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్లిన‌ట్లు తెలుస్తుంది. రెండు ప్రైవేటు వాహనాల్లో మద్దిపాడు పోలీసులు ఆర్జీవి ఇంటికి చేరుకున్నట్లు స‌మాచారం. ఆర్జీవి ఇంట్లో లేర‌ని చెప్పడంతో పోలీసులు ఇంటి బయటే వేచి ఉన్నారు. దీంతో ఏం జ‌రుగ‌నున్న‌దో అనే ఉత్కంఠ నెల‌కొంది.


Next Story