తెలంగాణ నేతన్నకు జై కొట్టిన ప్రధాని మోదీ

PM Modi in ‘Mann Ki Baat’ gives shout-out to Telangana weaver. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 95వ ఎపిసోడ్‌లో

By అంజి  Published on  27 Nov 2022 7:37 AM GMT
తెలంగాణ నేతన్నకు జై కొట్టిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 95వ ఎపిసోడ్‌లో ప్రసంగిస్తూ.. వచ్చే ఏడాది భారతదేశం నిర్వహించనున్న G20 సమ్మిట్‌లో స్వయంగా నేసిన లోగోను తనకు బహుమతిగా ఇచ్చిన తెలంగాణకు చెందిన ఒక నేతన్న ప్రశంసించారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వెల్ది హరిప్రసాద్‌ ప్రస్తావిస్తూ.. ఆయన నైపుణ్యాలపై మంచి ప్రావీణ్యం ఉందని, ఈ అద్భుతమైన బహుమతిని చూసి తాను ఆశ్చర్యపోయానని ప్రధాని అన్నారు

''తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత వెల్ది హరిప్రసాద్ నాకు స్వయంగా నేసిన జి20 లోగోను పంపారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. అతను తన నైపుణ్యాలపై అంత పట్టును కలిగి ఉన్నాడు. ఇది అందరినీ ఆకర్షిస్తుంది. అతను నాకు లేఖ కూడా పంపాడు. వచ్చే ఏడాది జీ20 సమ్మిట్‌ను నిర్వహించడం భారత్‌కు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని.. అతను ఈ లోగోను తయారు చేశాడు. అతను ఈ ప్రతిభను తన తండ్రి నుండి వారసత్వంగా పొందాడు'' అని ప్రధాని మోదీ చెప్పారు.

''ఈ రోజు హరిప్రసాద్ వంటి చాలా మంది నాకు లేఖలు పంపారు. దేశం ఇంత పెద్ద సమ్మిట్‌ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. జీ-20కి సంబంధించి భారత్‌ క్రియాశీలక ప్రయత్నాలను వారు ఎంతో అభినందిస్తున్నారు'' అని ప్రధాని మోదీ తెలిపారు. G20 లోగోను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ప్రారంభించే ప్రత్యేకత తనకు ఉందని, అయితే బహిరంగ పోటీ ద్వారా ఈ లోగోను ఎంపిక చేసినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. హరిప్రసాద్‌ పంపిన ఈ బహుమతిని అందుకోగానే తన మదిలో మరో ఆలోచన వచ్చిందని మోదీ అన్నారు.

జీ20 సమ్మిట్‌కు భారతదేశం అధ్యక్షత వహించడం ప్రపంచ వేదికపై భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను చూపుతుందని ప్రధాన మంత్రి అన్నారు. "వాణిజ్యంలో 85 శాతం వాటా కలిగిన దేశాల సమూహానికి నాయకత్వం వహించడం చాలా పెద్ద బాధ్యత, మంచి అవకాశం" అని ఆయన అన్నారు.

Next Story