మహబూబాబాద్‌ జిల్లాలో అమానవీయ ఘటన

Plucking Mangoes Behaves Abusively Towards Two Children Mahabubabad. మామిడి తోట వద్ద ఆగి పిందెలు తెంపారు. అది చూసిన కాపలాదారు యాకూబ్‌.. పిల్ల‌ల‌ చేతులు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టాడు.

By Medi Samrat
Published on : 2 April 2021 9:18 AM IST

plucking mangoes

ఇద్దరు చిన్నారులపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు తోట కాపలాదారులు. మహబూబాబాద్‌ జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండల శివారులోని బొత్తల తండాలో బానోతు యాకూబ్, బానోతు రాములు శివారులోని మామిడి తోటకు కాపలాదారులుగా ఉంటున్నారు.



గురువారం తొర్రూరుకు చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మాపురంలో బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో మామిడి తోట వద్ద ఆగి పిందెలు తెంపారు. అది చూసిన కాపలాదారు యాకూబ్‌.. పిల్ల‌ల‌ చేతులు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టాడు. వారికి పశువుల పేడ తినిపించి పైశాచికానందం పొందాడు. ఇక ఈ మృగాడికి తోడు మ‌రోక తండా వాసి వీడియోలు తీశాడు. ప్ర‌స్తుతం ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story