సింగరేణి స్థలాలలో పెట్రోల్ బంకులు

సింగరేణి సంస్థ తన ఖాళీ జాగాలను లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.

By Kalasani Durgapraveen  Published on  28 Oct 2024 5:19 PM IST
సింగరేణి స్థలాలలో పెట్రోల్ బంకులు

సింగరేణి సంస్థ తన ఖాళీ జాగాలను లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. సింగరేణివ్యాప్తంగా వర్తక, వాణిజ్య పరంగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను అధికారులు గుర్తించారు. సింగరేణి విలువైన తన జాగాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడమే కాకుండా లీజు ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందని సింగరేణి అధికారులు భావిస్తున్నారు. ఏడు ఏరియాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఇంధన సంస్థల నుంచి టెండర్లను కూడా ఆహ్వానించారు.

సింగరేణి ఉద్యోగులకు ఉద్యోగులకు క్వాలిటీ పెట్రోలు, డీజిల్ను అందించాలని భావించి సూపర్ బజార్ల ఆధ్వర్యంలో పెట్రోల్బంకుల ఏర్పాటుకు 2016 సెప్టెంబర్లోనే సింగరేణి నిర్ణయం తీసుకుంది. బంకుల ఏర్పాటుకు అధికారులుకసరత్తు చేశారు. అందుకు అవసరమైన స్థలాల సేకరణ కూడా చేపట్టారు. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలు ఒక్కో ఏరియాలో రెండు నుంచి మూడు బంకులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపాయి.

హెచ్పీసీఎల్11 పెట్రోల్ బంకుల కోసం స్థలాల సేకరణ పూర్తి చేశారు. ఒక్కో దానికి సుమారు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. స్థల సేకరణ అనంతరం 90 రోజుల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోవైపు వీటి ద్వారా సుమారు 900 మందికి ఉపాధి కూడా దొరుకుందని పేర్కొన్నారు.

సింగరేణి ఖాళీ జాగాలపై యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మార్కెటి విలువ ప్రకారమే ఇంధన సంస్థకు లీజుకు కేటాయించి ఏడాదికి కొంత ఆదాయం సమకూర్చుకోనుంది. సింగరేణి ఏరియాలోని కొన్ని కార్మిక ప్రాంతాల్లో ఇంధనానికి నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. దీంతో యాజమాన్యం మందమర్రి (బెల్లంపల్లి ప్రాంతం), సెంటినరీ కాలనీ, గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, భూపాలపల్లి, మణుగూరు, కొత్తగూడెం ఏరియాల్లో బంకుల ఏర్పాటుకు ఇంధన సంస్థకు లీజుకు ఖాళీ స్థలాలను కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది.ఒక్కో బంకుకు సుమారు 748 చదరపు అడుగుల నుంచి 3,617 చదరపు అడుగుల వరకు కేటాయించనుంది. 20 నుంచి 30 ఏండ్ల పాటు లీజుకు ఇవ్వనుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి దాని విలువ పెంచుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకోనుంది.

ప్రధానంగా నేషనల్ హైవేలు, మెయిన్ రోడ్ల పక్కన, కమర్షియల్ కాంప్లెక్స్ ల్లోని సింగరేణి ఖాళీ జాగాలను బంకులకు కేటాయించనుంది. నేషనల్ హైవే పక్కన ఉండటంతో వీటిని పెట్రోల్ బంకులకు లీజుకు ఇస్తే ఆదాయంతో పాటు కబ్జాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని సింగరేణి భావిస్తోంది. కార్మిక ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తే సంస్థ కార్మికులతో పాటు ఇతర వినియోగదారులకు అందుబాటు క్వాలిటీ ఇంధనం లభించనుంది.

Next Story