తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని వంగ గోపాల్‌రెడ్డి సెప్టెంబరు 29న సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చారని పిటిషన్‌లో తెలిపారు. కాగా జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 6న పిటిషన్‌పై విచారణ జరపనుంది.
మరో వైపు తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలపగా, తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.