తెలంగాణ రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు రాయితీ మరో మూడు రోజులు మాత్రమే అమలు కానుంది. రాయితీతో చలాన్ల క్లియరెన్స్ మార్చి 1న మొదలు కాగా.. మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 15 తో ముగుస్తోంది. ఇప్పటికే ఓ సారి రాయితీ గడువును పొడిగించగా.. మరోసారి పొడిగించే అవకాశం లేదు. కాబట్టి వాహనదారులు తమ వాహనాలపై ఉన్న చలాన్లు చెల్లించేందుకు త్వరపడాలని ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. నెట్ బ్యాంకింగ్ లేదా పేటియం ద్వారా గాని మరియు మీ దగ్గరలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి గాని మీ వెహికల్ పై ఉన్న పెండింగ్ చలాన్స్ ను చెల్లించవచ్చు
ప్రభుత్వము ఇచ్చిన డిస్కౌంట్లో భాగంగా..
1) టూ వీలర్/ త్రీ వీలర్ వెహికల్స్ పై ఉన్న చలానాల పై 75% డిస్కౌంట్,
2) ఫోర్ వీలర్, హెవీ వెహికల్స్ కి 50% డిస్కౌంట్
3) ఆటో కి 70% డిస్కౌంట్
4) కరోనా సమయంలో మాస్కు పెట్టుకోని కారణంగా వేసిన కేసులలో 90% డిస్కౌంట్