డబ్బు కంటే కులమే గొప్పది..పెద్దపల్లి ఎంపీ హాట్ కామెంట్స్
కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం అందకపోవడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీ సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik
డబ్బు కంటే కులమే గొప్పది..పెద్దపల్లి ఎంపీ హాట్ కామెంట్స్
కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం అందకపోవడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీ సంచలన కామెంట్స్ చేశారు. కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల సందర్భంగా నదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ఆయన మీడియాతో.. తనకు కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై స్పందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాల కు నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. ఈ ఘటనతో కొందరు నాయకులు కులాల పరంగా ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసుకున్నానని అన్నారు. అలాగే తాను డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నానని రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలను వెళ్లొచ్చని మరోసారి గుర్తుచేస్తున్నానని ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ చెప్పుకొచ్చారు.
కాగా ఈ నెల 15న పుష్కరాలు ప్రారంభం కాగా.. సీఎం రేవంత్ వచ్చిన అధికారిక కార్యక్రమ ఫ్లెక్సీలో వంశీ ఫోటో పెట్టలేదని మంథని నియోజకవర్గంలోని దళిత సంఘాలు, ఎంపీ అనుచరులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ వివాదంపై ఎస్సీ కమిషన్‌కు, మానవ హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, శాఖ ముఖ్య కార్యదర్శిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగానే తన ఫోటో పెట్టలేదని వంశీ తో పాటు ఆయన తండ్రి, ఎమ్మెల్యే వివేక్సైతం ఓ అంచనాకు వచ్చి.. ఈ విషయాన్ని పార్టీ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.