అంత ఉత్తదే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఆయనతో టచ్‌లో లేరు
హరీష్ రావు నీ స్థాయి ఏందీ.. సీఎంతోనే సవాల్ చేస్తున్నావ్.. కేసీఆర్ ఆదేశాల మేరకే చేస్తున్నావా అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు
By Medi Samrat Published on 25 April 2024 1:15 PM GMTహరీష్ రావు నీ స్థాయి ఏందీ.. సీఎంతోనే సవాల్ చేస్తున్నావ్.. కేసీఆర్ ఆదేశాల మేరకే చేస్తున్నావా అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆగస్ట్ నెలలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.. మీరు తెలంగాణను ఆగం చేసిండ్రని ఫైర్ అయ్యారు. నాలుగు నెలలకే ఆగుతలేరు.. 15 రోజులకే రోడ్డెక్కిండ్రు అని మండపడ్డారు. కేసీఆర్ నిన్ను నమ్ముతాడా.. కేసీఆర్, కేటీఆర్ నిన్న బయటికి పంపే పనిలో వున్నారని.. ఆగస్ట్ 15న మూటాముల్లె సర్దుకొని పెట్టుకో ఫామ్ హౌస్ కు వెళ్లడానికి అని అన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినామన్నారు. హరీష్ రావు నీకు దమ్ముంటే మెదక్ పార్లమెంటును గెలిపించుకో.. అని సవాల్ విసిరారు. మీ అక్రమాలపై విచారణ జరుగుతోంది గుర్తుపెట్టుకొని మాట్లాడాలన్నారు. విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ప్రగతిశీల మార్గంలో తీసుకెళ్తున్నాం.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పటికే కొన్ని చేశాం.. లోక్ సభ ఎన్నికల తర్వాత మిగిలినవి చేస్తాం.. కేసీఆర్ భయాందోళనలో మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా ఉండడానికే అలా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు టచ్ లో లేరు.. అంత ఉత్తదే అన్నారు. హరీష్ సవాల్ వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకో.. నీస్థాయి ఎమ్మెల్యే స్థాయి.. నీకు నేను సరిపోతా.. సీఎం ఎందుకు అని అన్నారు. ఎమ్మెల్యేను, గతంలో సీఎల్సీ సెక్రెటరీగా చేశానన్నారు.
బీజేపీ కుట్రలు చేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందన్నారు. తెలంగాణ లో ఎన్ని కుట్రలు చేసిన వర్కవుట్ కాదన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు రుణపడి వుంటారన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.