విద్యార్థినిలతో అసభ్యకర ప్రవర్తన.. ఉపాధ్యాయుడిని చెప్పుతో చితక్కొట్టిన తల్లిదండ్రులు
బయటనే కాదు... దేవాలయం లాంటి పాఠశాలలో కూడా కామాంధులు కొరలు చాచి విషం చిమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
By అంజి Published on 4 Dec 2024 1:45 PM ISTవిద్యార్థినిలతో అసభ్యకర ప్రవర్తన.. ఉపాధ్యాయుడిని చెప్పుతో చితక్కొట్టిన తల్లిదండ్రులు
బయటనే కాదు... దేవాలయం లాంటి పాఠశాలలో కూడా కామాంధులు కొరలు చాచి విషం చిమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. కామంతో కొట్టు మిట్టాడుతున్న కొందరు ఉపాధ్యాయులు అభం శుభం తెలియని చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక... లోలోపల కుమిలిపోతున్నారు ఆ చిన్నా రులు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఓ స్కూల్ ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.
మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సత్యనారాయణ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతను పాఠాల పేరుతో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రతిరోజు పాఠాలు చెబుతూ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండడంతో విద్యార్థినిలు తల్లిదండ్రులకు చెప్పారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థినిల తల్లిదండ్రులను చూసిన ఉపాధ్యా యుడు సత్యనారాయణ గోడ దూకి పారిపోయాడు. అది గమనించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు తల్లిదండ్రులందరూ కలిసి జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను పట్టుకొని చితకబాదారు. అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయునిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.