కేసీఆర్‌కు నోటీసులు..విద్యుత్‌శాఖలో అవకతవకలపై వివరణ ఇవ్వాలని ఆదేశం

మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు.

By Srikanth Gundamalla
Published on : 11 Jun 2024 8:15 PM IST

telangana, notice, kcr,

కేసీఆర్‌కు నోటీసులు..విద్యుత్‌శాఖలో అవకతవకలపై వివరణ ఇవ్వాలని ఆదేశం

తెలంగాణలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణ జరిపిన విచారణ కమిషన్ కె చంద్రశేఖర్ రావుతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. విచారణలో భాగంగా వీరు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు.

విచారణలో ఉన్న సమస్యలపై నిర్ణయాలు తీసుకున్న 25 మంది అధికారులు, అనధికారులను ప్యానెల్ గుర్తించిందని కమిషన్ అధిపతి రిటైర్డ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మంగళవారం చెప్పారు. తెలంగాణ- బీఆర్‌ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్రాజెక్టులతో విద్యుత్ ఒప్పందాలను కొనుగోలు చేసిన కేసులో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు నోటీసులు అందాయి. వివరణను సమర్పించేందుకు జూలై నెలాఖరు వరకు సమయం కావాలని కె. చంద్రశేఖర్‌రావు కోరారని, అయితే పరిమిత వ్యవధి మాత్రమే అందుబాటులో ఉన్నందున జూన్ 15లోగా సమర్పించాలని కమిషన్ తనకు సూచించిందని రిటైర్డ్‌ జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి చెప్పారు.

ఈ ఏడాది మార్చి 12న మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ భద్రాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్ల అక్రమాలపై విచారణకు రిటైర్డ్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి నేతృత్వం వహిస్తారని చెప్పిన విషయం తెలిసిందే. గత బిఆర్‌ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన విద్యుత్ కొనుగోలుపై కూడా విచారణ వర్తిస్తుంది. ఈ విచారణ వ్యవధి కూడా 100 రోజులు ఉంటుందని ఆయన చెప్పారు.

Next Story