హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రభుత్వం రేపు (బుధవారం) సాధారణ సెలవు ప్రకటించింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికలు జరిగే పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల ఆఫీసులు మూసివేయబడతాయి. ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఓటు వేయడానికి పెయిడ్ హాలిడే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఈ సెలవు తప్పనిసరి అయింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొని, బాధ్యతగా ఓటు వేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.